ట్యాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ‘ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టింది. నిన్న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 8.88కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ మూవీ గా నిలిచింది. ఉగాది సందర్భంగా నిన్న సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాకు చాలా చోట్ల హోస్ ఫుల్ కలెక్షన్స్ పడ్డాయి. ఇక ఈచిత్రం 4కోట్లకు పైగా షేర్ ను తెచ్చుకోవడంతో తొలిరోజే బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా కలెక్ట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని విశ్వక్ సేనే డైరెక్ట్ చేయడం విశేషం. దర్శకుడిగా అతనికిది రెండో సినిమా. యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్, విశ్వక్ కు జంటగా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. రావు రమేష్ , రోహిణి , అక్షరా గౌడ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈచిత్రాన్ని నిర్మించారు.
మరోవైపు జయాపజయాలతో సంబంధం లేకుండా విశ్వక్ సేన్ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం విశ్వక్’ గామి’లో నటిస్తున్నాడు. అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని విద్యాదర్ కాగిత డైరెక్ట్ చేస్తుండగా కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే విశ్వక్ తన 10వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంచ్ అయ్యింది. ఎస్ ఆర్ టి ఎంటైర్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేయనున్నాడు . హిట్ 2 ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: