ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఎంత పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ లవర్స్ కు అయితే అసలైన పండగ ఇదే అని చెప్పొచ్చు. ఇక ఈ సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో ముందుగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో ఈసినిమా రాబోతుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆక్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక ఇదే రోజు రిలీజ్ కాబోతున్న సినిమా హనుమాన్. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా ఈసినిమా వస్తుంది. మొదటిసారి సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక జనవరి 13వ తేదీన రిలీజ్ కాబోతున్న సినిమా సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. అంతేకాదు వెంకీ కూడా చాలా కాలం తరువాత ఇలాంటి పాత్రతో వస్తుండటంతో ఈసినిమాపై కూడా మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక జనవరి14వ తేదీన రాబోతున్న సినిమా నాసామిరంగ. బిన్ని దర్శకత్వంలో నాగార్జున హీరోగా, అల్లరి నరేష్, రాజ్ తరణ్ కీలక పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఇక నాగ్ కూడా చాలా కాలం తరువాత ఫుల్ మాస్ రోల్ తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ నాలుగు సినిమాల్లో మీరు ఏ సినిమా ముందు చూడాలని కోరుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”113397″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: