రివ్యూ  : టిల్లు స్క్వేర్

Tillu Square telugu review

నటీనటులు : సిద్దు జొన్నలగడ్డ ,అనుపమ పరమేశ్వరన్ ,మురళీధర్ గౌడ్,మురళీ శర్మ
ఎడిటింగ్ : నవీన్ నూలి
సంగీతం : రామ్ మిర్యాల,అచ్చు రాజమణి
దర్శకత్వం : మల్లిక్ రామ్
నిర్మాతలు : నాగవంశీ , సాయి సౌజన్య

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎలాంటి అంచనాలు లేకుండా రెండు సంవత్సరాల క్రితం వచ్చి సెన్సేషన్ సృష్టించింది డీజే టిల్లు.హీరో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ కు అందరు ఇంప్రెస్ అయ్యారు.ఇక ఈసినిమా కు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రానుందనడంతో అంచనాలు పెరిగిపోయాయి.సాంగ్స్,ట్రైలర్లు కూడా హైప్ వర్త్ అనిపించేలా చేశాయి.మరి ఈరోజే థియేటర్లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ ఎలా వుంది? అంచనాలను అందుకుందా లేదో చూద్దాం.

కథ : 

రాధికా తరువాత టిల్లు జీవితంలోకి లిల్లీ (అనుపమ )వస్తుంది.ఓ పబ్ లో తనను చూసి ఇష్టపడతాడు టిల్లు.ఆ తరువాత లిల్లీ కూడా టిల్లు ను ఇష్టపడుతుంది అయితే సడెన్ గా టిల్లు జీవితం నుండి లిల్లీ మాయమవుతుంది.టిల్లు తనను తలుచుకొని వెతకడం మొదలుపెడతాడు. చివరికి  మళ్ళీ ఎలాగోలా  లిల్లీ ని కలుస్తాడు. ఆతర్వాత ఏమైంది? టిల్లు ను లిల్లీ  కోరిన సాయం ఏంటి?వీరి మధ్యలోకి ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహబూబ్ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? చివరికి ఏమైంది అనేది మిగితా కథ.

విశ్లేషణ : 

కథ ను పక్కన పడితే  రెండు గంటలు నాన్ స్టాప్ గా నవ్వించడం కోసమే తీసిన సినిమా ఇది.ప్రమోషన్స్ లోకూడా టీం ఇదే చెప్పుకుంటూ వచ్చింది.ఇక సినిమా కూడా ఆలాగే వుంది.స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసింది.డైరెక్టర్ మల్లిక్ రామ్ టేకింగ్ బాగుంది.రైటింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.లాజిక్ లు వెతకకుండా 2గంటలు ఎంజాయ్ చేసి సినిమా ఇది.

ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ కార్డు పడే వరకు నవ్వుతూనే వుంటారు.ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్టు కూడా థ్రిల్ చేస్తుంది.ఇక సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లోతో కంటిన్యూ అవుతుంది.రెండు,మూడు బ్లాక్ లు హిలేరియస్ గా పేలాయి.టిల్లు క్యారెక్టర్ సినిమాకు బలం.ఫస్ట్ పార్ట్ లో సిద్దూ తన యాక్టింగ్ తో ఏ విధంగా సప్రైజ్ చేశాడో ఈ సీక్వెల్ లోకూడా అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు.ఓవరాల్ గా టిల్లు స్క్వేర్ పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్.నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే సిద్దు వన్ మ్యాన్ షో చేశాడు.డీజే టిల్లు తోనే యాక్టర్ గా తానేంటో నిరూపించుకున్నాడు.టిల్లు స్క్వేర్ లో మరింతగా అలరించాడు.తన నోటి నుండి వచ్చిన వన్ లైనర్స్ బాగా పేలాయి.సూపర్ టైమింగ్ కు తోడు తన మ్యానరిజం మెప్పిస్తుంది.ఈసినిమా తరువాత సిద్దు స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక ఈసినిమాలో సప్రైజ్ ఏంటంటే అనుపమ పరమేశ్వరన్ రోల్.ఇంతకుముందు ఎప్పడూ లేనంతగా గ్లామర్ షో చేసింది.కథ కు అవసరం కావడంతో తప్పలేదు.యాక్టింగ్ విషయానికి వస్తే  చాలా సెటిల్డ్ గా చేస్తూ తెర మీద లిల్లీ మాత్రమే కనిపించేలా చేసింది.వీరి తరువాత మురళీధర్ గౌడ్ రోల్ సినిమాలో హైలైట్ అయ్యింది.తనకు, టిల్లు కు మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా వున్నాయి.మిగితా పాత్రల్లో నటించిన వారందరూ పర్వాలేదనిపించారు.

టెక్నికల్ కూడా సినిమా సూపర్ అనిపించింది.డైరెక్టర్ మల్లిక్ రామ్ మంచి స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను డీల్ చేశాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ షార్ప్ గా వుంది.రామ్ మిర్యాల,అచ్చు రాజమణి సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది.సాంగ్స్ బాగున్నాయి.భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు.ప్రొడక్షన్ విషయానికి వస్తే సినిమాకు చాలా ఖర్చు పెట్టారు.బడ్జెట్ లిమిట్స్ చూడకుండా నాగవంశీ ,సాయి సౌజన్య మంచి క్యాలిటీ తో సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా మచ్ అవైటెడ్ సీక్వెల్ అనే ట్యాగ్ తో వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ ,డీజే టిల్లు కన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేసింది.సినిమాలో రెండు గంటలు నాన్ స్టాప్ కామెడీ, సిద్దు ,అనుపమ రోల్స్ హైలైట్ అయ్యాయి.ఈ సమ్మర్ లో థియేటర్లలో చిల్ అవ్వాలంటే టిల్లు స్క్వేర్ మంచి ఆప్షన్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 1 =