చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది మ్యాడ్.ఈనెల 6న విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ఏ లోనూ 500k డాలర్ల ను రాబట్టి హిట్ అనిపించుకుంది.దసరా సీజన్ లో పెద్ద సినిమాలు రావడంతో మ్యాడ్ హావ తగ్గింది లేకపోతే సినిమా కలెక్షన్స్ మరింత పెరిగేవే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది.ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను వచ్చే నెల 3నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మరి థియేటర్లలో విజిల్స్ వేయించిన ఈసినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఈసినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతని తోపాటు సంగీత్ శోభన్,రామ్ నితిన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈచిత్రంలో గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లు గా నటించారు.మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు ఓయ్ కీలక పాత్రలు పోషించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.హారిక సూర్యదేవర,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: