ఆడు జీవితం- 25 రోజుల్లో 150 కోట్లు

prudhvi raj sukumaran aadujeevitham movie 25 days collections

మలయాళం సినిమాలు కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. దానికి కారణం డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు రావడమే అందుకు కారణం. ఇక రీసెంట్ గా మరో సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. ఆ సినిమా మరేదో కాదు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన ఆడు జీవితం సినిమా. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా వచ్చింది. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మార్చి28వ తేదీన రిలీజ్ అయి మంటి హిట్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబలోకి చేరగా ఇప్పుడు మరో మైల్ స్టోన్ ను అందుకుంది. ఈసినిమా రిలీజ్ అయి 25 రోజులు పూర్తికాగా.. 25రోజుల్లో ఈసినిమా 150 కోట్లను సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కలిపి ఈ వసూళ్లను రాబట్టుకుంది ఈసినిమా.

కాగా ఈసినిమాలో అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఏఆర్. రెహ‌మాన్ సంగీతం అందించారు. జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా నిర్మించాయి. తెలుగులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలుగులో రిలీజ్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 14 =