వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సే న్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ 1.0, 2.0 ట్రైలర్ ప్రేక్షకులనుఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధమ్కీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నివేత పేతురాజ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ పై ప్రశంసలు కురిపించారు. నివేత మాట్లాడుతూ .. ధమ్కీ మూవీ విశ్వక్ సేన్ తో రెండవ మూవీ అనీ.. పాగల్ చేస్తున్నప్పుడే ఓరి దేవుడా మూవీ కి కాల్ వచ్చిందనీ.. కానీ ఆ పాత్ర తనకు సరిపోదని భావించాననీ.. తర్వాత ధమ్కీ మూవీ స్క్రిప్ట్ విన్నాననీ.. ఇందులో పాత్ర చాలా నచ్చిందనీ.. కథ కూడా చాలా యూనిక్ గా ఉందనీ.. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడం మరింత స్పెషల్ గా మారిందనీ.. విశ్వక్ సేన్ వెరీ టాలెంటెడ్, ఎనర్జిటిక్ పర్సన్ అనీ.. తాను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్ సేన్ లో చూశాననీ.. విశ్వక్ లో చాలా మాస్ ఉందనీ.. బాలకృష్ణ గారు లాంటి పెద్ద మాస్ హీరోలని డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ లో ఉందనీ.. ఆయనికి గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి అనీ.. ఆయన చాలా మంచి గ్యాంగ్ స్టర్ డైరెక్టర్ అవుతారనీ.. ఆయన దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: