కల్కి 2898AD కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Kalki 2898 AD Movie new Release Date fixed

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898ఏడి.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ సాంకేతికతో ఈసినిమాను రూపొందిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక ఈసినిమా రిలీజ్ విషయంపై గత కొద్దిరోలుజుగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈసినిమాను మే9వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఈసినిమా చెప్పిన డేట్ కు రావట్లేదని.. వాయిదా పడే అవకాశం ఉంటుందని పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. మే నుండి ఈసినిమాను జూన్ కు పోస్ట్ పోన్ చేశారు. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా అప్ డేట్లను ఇస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి వస్తున్న అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్నాయి.

కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =