మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ విశ్వక్ మధ్యలో వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సుట్టంలా సూసి పోకలా లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ ను రాబట్టుకోగా .. మరోవైపు మోత లిరికల్ వీడియో సాంగ్కు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. విశ్వక్ సేన్ మాస్ యాక్షన్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అమ్మోరు పూనేసింది రా!! 💥
ఈసారి ఒక్కోక్కడికి శివాలెత్తిపోద్దంతే!! 💥🪓🔥Here’s the teaser of #GangsOfGodavari ~ Presenting ‘Mass Ka Das @VishwakSenActor in & as ‘𝑳𝒂𝒏𝒌𝒂𝒍𝒂 𝑹𝒂𝒕𝒉𝒏𝒂’ 🔥#GOGTeaser Out Now – https://t.co/ukPb36QKbt
Grand release at theatres near you… pic.twitter.com/FKc4M5zWQN
— Sithara Entertainments (@SitharaEnts) April 27, 2024
కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: