రివ్యూ : రావణాసుర

Ravanasura Telugu Movie Review

నటీనటులు : రవితేజ,అను ఇమ్మాన్యుయేల్,మేఘా ఆకాష్,ఫరియా అబ్దుల్లా,హైపర్ ఆది
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్ ,భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కణ్ణన్
దర్శకత్వం : సుధీర్ వర్మ
నిర్మాతలు : అభిషేక్ నామ,రవితేజ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధమాకా ,వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో వున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇక అదే ఊపులో హ్యాట్రిక్ కొట్టడానికి ఈరోజు రావణాసురతో బాక్సాఫీస్ బరిలో దిగాడు. మరి ఈసినిమా ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

రవి (రవితేజ) క్రిమినల్ లాయర్. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ అయిన కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్ గా చేరుతాడు. ఈక్రమంలో హారిక (మేఘా ఆకాష్) కేసు మీద ఆసక్తిచూపిస్తాడు రవి. ఇంతకీ ఆ కేసుకి రవికి ఏంటి సంబంధం ? దాని వెనుకాల వున్న కథ ఏంటి ? అసలు హారిక ఎవరు? చివరికి ఈ కేసును రవి ఎలాచేదించాడు అనేది మిగితా కథ.

విశ్లేషణ :

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీకాంత్ విస్సా రాసిన కథతో ఈసినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సుధీర్ వర్మ. కామెడీ ,ట్విస్ట్ లు అలాగే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ అలాగే ఇంటర్వెల్ తరువాత వచ్చే సీక్వెన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో రవి ,కనక మహాలక్ష్మి క్యారెక్టర్ లను కథలో భాగం చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఆసీన్లు ఆకట్టుకుంటాయి అలాగే రవితేజ, హైపర్ ఆది కలిసి చేసే కామెడీ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు , ట్విస్టులు సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచుతాయి.

ఇక సెకండ్ హాఫ్ లో కూడా అదే జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా రవితేజ నెగిటివ్ షేడ్ లో కనిపించడం సినిమాలో మేజర్ హైలైట్ గా చెప్పొచ్చు. ఇన్ని రోజులు రొటీన్ పాత్రల్లో కనిపించిన రవితేజ ,రావణాసుర లో నెగిటివ్ షేడ్ లో కనిపించి థ్రిల్ చేశాడు. సెకండ్ హాఫ్ లో రవితేజ నట విశ్వరూపాన్ని చూపించడంతో సినిమా అంచనాలను అందుకొని రవితేజ కి హ్యాట్రిక్ ఇవ్వడం ఖాయమనిస్తుంది. ఇక రవితేజకి తోడు మిగితా క్యాస్టింగ్ కూడా తమ పాత్రలకు న్యాయం చేయడం అలాగే టెక్నికిల్ డిపార్ట్మెంట్ కూడా మంచి అవుట్ ఫుట్ ఇవ్వడంతో ఈ రావణాసుర సూపర్ హిట్ కావడం ఖాయమనే చెప్పొచ్చు.

పెర్ఫార్మెన్స్ :

రవాణాసుర లో వన్ మ్యాన్ షో చేశాడు రవితేజ. లాయర్ పాత్రలో హైపర్ ఆదితో కలిసి ఎంటర్టైన్మెంట్  ఇస్తూ నెగెటివ్ షేడ్ లో కూడా చెలరేగిపోయాడు. కేవలం రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగితా ప్రేక్షకులు కూడా రవితేజ యాక్టింగ్ చూసి ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ టైం నెగటివ్ షేడ్ లో కనిపించిన రవితేజ ఆ పాత్రను తన నటనతో మరో స్థాయిలో నిలబెట్టాడు. ఇక ఈసినిమాలో బోలెడంత మంది తెలిసిన ఆర్టిస్టులు నటించారు. అయితే రవితేజ తరువాత సుశాంత్ పాత్రా సినిమాలో హైలైట్ అయ్యింది. సుశాంత్ తన పాత్రకి న్యాయం చేశాడు. అలాగే ఈసినిమాలో ఏకంగా 5గురు హీరోయిన్లు నటించారు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ , ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్ ,పూజితా పొన్నాడ వీరందరికి మంచి రోల్స్  పడ్డాయి. ఇక హైపర్ ఆది కామెడీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. వీరితో పాటు జయరాం ,రావు రమేష్, మురళి శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. ఓవరాల్ గా క్యాస్టింగ్, సినిమాకు ఏం కావాలో అది ఇచ్చింది.

సాంకేతిక విభాగం:

ఓ క్రైమ్ థ్రిల్లర్ ని ట్విస్టులతో థ్రిల్లింగ్ గా చూపించడంలో డైరెక్టర్ సుధీర్ వర్మ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా రవితేజని నెగిటివ్ షేడ్ లో చూపెట్టిన విధానం బాగుంది. యాక్షన్ తోపాటు కామెడీ ,ఎమోషన్స్ సీన్స్ తో  సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. ఇక మిగితా టెక్నిషియన్స్ కూడా సినిమాకు ఏం కావాలో అది ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ముఖ్యంగా రవితేజను చాలా  కొత్తగా చూపెట్టాడు. అభిషేక్ నామా ,రవితేజ సినిమాకు బాగా ఖర్చు చేసి చాలా క్వాలిటీ గా నిర్మించారు.

తీర్పు :

క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ రావాణాసుర అంచనాలను అందుకొని రవితేజకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమాలో రవితేజ నటన సినిమాకు మెయిన్ హైలైట్ అవ్వగా ట్విస్టులు ,కామెడీ ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈసినిమా, క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్ట పడే వారికి బాగా నచ్చుతుంది. మిగితా వారు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.