మంజుమ్మల్ బాయ్స్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ 

Manjummel Boys wiil be streaming from May 5th on Disney Plus Hotstar

మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మల్  బాయ్స్ ఓటిటి లోకి వచ్చేస్తుంది.వచ్చే నెల 5నుండి ఈసినిమా తెలుగుతోపాటు మలయాళ ,కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ భాషల్లోస్ట్రీమింగ్ లోకి రానుందని స్ట్రీమింగ్ పార్టనర్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.ఇక ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రపంచ వ్యాప్తంగా  230కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అంతేకాదు 200కోట్ల క్లబ్ లో చేరిన మొదటి మలయాళ సినిమా కూడా ఇదే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగులో అదే టైటిల్ తో ఈ నెల 6న విడుదలచేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.దాదాపు 8కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.మరి థియేటర్లలో అదిరగొట్టిన ఈ సినిమా ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

సర్వైవల్ థ్రిల్లర్ గా  చిదంబరం తెరకెక్కించిన ఈసినిమాలో  శ్రీనాథ్ భాసి,బాలు వర్గీస్ ,గణపతి,దీపక్ పరంబోల్ , సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటించగా సుషిన్ శ్యామ్ సంగీతం అందించాడు. బాబు షాహిర్ ,షాన్ ఆంటోనీ ఈసినిమాను నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =