బాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తరువాత పలు సినిమాలతో అలరించాడు నారా రోహిత్. అయితే చాలా కాలం తను సినిమాలకు దూరంగా ఉండగా ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత నారా రోహిత్ నుండి వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలను కూడా రిలీజ్ చేసుకుంది. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై మంచి క్యూరియాసిటినీ పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ ఇప్పుడు వాయిదా పడింది. నిజానికి ఈసినిమాను ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ రిలీజ్ కు ఇంకా రెండు రోజులు ఉందనగా ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
#Prathinidhi2 takes a brief pause, but fear not! ❤️🔥
We’ll be reporting soon at theatres near you with an exciting new release date.💥@IamRohithNara #SireeLella @murthyscribe @SagarMahati @TSAnjaneyulu1 @Nchamidisetty @Kumarraja423 @VanaraEnts #RanaArts pic.twitter.com/iduqYjIbvR
— Vanara Entertainments (@VanaraEnts) April 23, 2024
కాగా ఈసినిమాలో సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తుండగా.. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వానర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: