రివ్యూ : రంగమార్తాండ

Rangamarthanda Telugu Movie Review

నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ , బ్రహ్మానందం

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీతం :  ఇళయరాజా 

ఎడిటింగ్ : పవన్ వికె 

సినిమాటోగఫ్రీ : రాజ్ నల్లి 

దర్శకత్వం : కృష్ణవంశీ 

నిర్మాతలు : మధు కాలిపు, ఎస్.వెంకట్ రెడ్డి 

మరాఠిలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం ‘నట్ సామ్రాట్’. దాన్ని తెలుగు లో ‘రంగమార్తాండ‘ గా రీమేక్ చేసారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఈసినిమా ఉగాది రోజున ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 

కథ

రంగమార్తాండ రాఘవ రావు ( ప్రకాష్ రాజ్)కి సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేక  స్టేజి షో ల ద్వారా లెజెండరీ నటుడు గా పేరు తెచ్చుకుని విశిష్ట గుర్తింపు ను తెచ్చుకుంటాడు. అయితే వయసు పైబడే సరికి నాటకాల నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అలా రిటైర్ అయిపోయాక తన మిగిలిన జీవితాన్ని భార్య , ఇద్దరు పిల్లలతో గడపాలనుకుంటాడు. అయితే ఈ క్రమంలో రాఘవ రావు అతని భార్య.. కొడుకు ,కూతరు నుండి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో వారి సొంత ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. మరి రాఘవరావు, అతని భార్య ఇంతకీ సొంత ఊరికి వెళ్ళారా ? చివరికి అందరూ కలిశారా, లేదా అనేదే మిగితాకథ. 

విశ్లేషణ

సినిమా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో  స్టార్ట్ అవుతుంది. నేనొక నటుణ్ని అంటూ  టాలీవుడ్ లోని లెజండరీ యాక్టర్స్ ను పరిచయం చేస్తూ నటుడి గొప్ప తనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.  ఇక సినిమాలోకి వెళితే టైటిల్ లో చెప్పినట్లు ఇది అమ్మ నాన్న ల కథ. వారి కంటే ఏది ఎక్కువ కాదు వారు వున్నప్పుడే బాగా చూసుకుందాం అంటూ మెసేజ్ ఇస్తూ కృష్ణవంశీ చేసిన సినిమా ఇది. సినిమా దాదాపు ఎమోషనల్ గానే సాగుతూ ఉంటుంది. మధ్య మధ్య లో  చక్రపాణి ,రాఘవ రావు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. లిమిటెడ్ క్యారెక్టర్ల తోనే సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో రాఘవ రావు నాటకాల నుండి రిటైర్ అవ్వడం ఆ తర్వాత ఫ్యామిలీ తో కాలాన్ని గడపడం ఆ క్రమంలో కొడుకు , కోడలు నుండి ఎలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నాడు అనేది చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో  కూతురు దగ్గరికి వెళ్తే  అక్కడ కొన్ని రోజులు బాగానే  ఉండడం ఆతరువాత కూతురు కూడా అనుకోని పరిస్థితుల్లో తండ్రిని అవమానించడం దాంతో రాఘవ రావు అతని సతీమణి  సొంత ఊరుకి వెళ్దాం అనుకోవడం, చివరికి  వారి ప్రయాణం ఎలా ముగిసిందో చూపెట్టారు. 

సినిమాను ఎమోషనల్ గానే ముగించాడు డైరెక్టర్ కృష్ణవంశీ అయితే మూవీని ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తూ పిల్లలకు మెసేజ్ ఇవ్వడం లో సక్సెస్ అయ్యాడు. అమ్మానాన్నల కథతో ఇంతకుముందు చాలా సినిమాలే వచ్చాయి అయితే వాటి కంటే ఈ సినిమా డిఫ్రెంట్ గా ఉంటుంది.  రీమేక్ సినిమా ఏ అయినా కధని ట్రీట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఎక్కడా ఎమోషనల్ కనెక్టివిటి మిస్ అవ్వకుండా తీర్చిదిద్దారు. బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే హాస్పిటల్ సన్నివేషాలు కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి.  సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి.  ‘అక్షరాలను పొడిగా వాడకు దాని  వెనుకున్న తడి తెలుసుకో’, ‘రంగులేసుకుని బ్రతికినంత సులువు కాదురా రంగుల్లేని ప్రపంచంలో బ్రతకడం’ లాంటి డైలాగ్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను ఎక్కడా నిరాశపరచదు. అయితే  కృష్ణవంశీ గత సినిమాలకు ఈ సినిమా కొంచెం భిన్నంగా ఉంటుంది. 

పెరఫార్మెన్స్  : 

రంగమార్తాండ రాఘవ రావు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించేశారు. చాలా రోజుల తరువాత మళ్ళీ తన నట విశ్వరూపాన్ని చూపించారు. భారీ డైలాగ్ లను కూడా అలవోకగా పలుకుతూ తన అనుభవాన్ని చూపించారు. అలాగే రాఘవరావు భార్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ తన పాత్రకు న్యాయం చేసింది. కళ్ళతోనే ఎమోషన్స్ ని పండిస్తూ అద్భుతమైన నటన కనబరిచింది..  ఇక రాఘవరావు స్నేహితుడు చక్రపాణి పాత్రలో నటించిన బ్రహ్మనందం గారు రెగ్యులర్ గా చేసే కామెడీ పాత్రలో కాకుండా చాలా బరువైన చక్రపాణి పాత్రలోకి పరకాయప్రవేశం చేసి నట విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్రహ్మానందం గారి నటన థియేటర్లో ప్రతి ఒక్కర్ని కనురెప్ప వెయ్యనివ్వకుండా కట్టిపడేస్తుంది. ఇక మిగితా పాత్రల్లో  నటించిన ఆదర్శ్ బాలకృష్ణ , రాహుల్ సిప్లిగంజ్ , అలీ రెజా ,అనసూయ ,శివాత్మిక రాజశేఖర్ తమ పాత్రల పరిధి మేర నటించారు. 

టెక్నికల్ వాల్యూస్

డైరెక్టర్ గా కృష్ణవంశీ, సినిమాను ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం లో విజయం సాధించారు. కృష్ణవంశీ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసి మంచి మెసేజ్ ఇస్తూ  సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఇళయరాజా సంగీతం డీసెంట్ గా వుంది అయితే  ఈచిత్రానికి  బీజీఎమ్  చాలా ముఖ్యం. ఎమోషనల్ కంటెంట్  కాబట్టి  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండాలి ఈ విషయంలో  ఇళయరాజా నిరాశపరచలేదు . పవన్ వికె ఎడిటింగ్ , రాజ్ నల్లి సినిమాటోగ్రఫీ  బాగుంది. నిర్మాతలు మధు,వెంకట్ రెడ్డి  మంచి క్వాలిటీ తో సినిమాను నిర్మించారు. 

తీర్పు

ఓవరాల్ గా ఉగాది రోజున థియేటర్లలోకి వస్తున్న కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమా అద్భుతమైన కథ, కథనం, ఎమోషనల్ సీన్స్ తో అందర్నీ ఆట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మనందం నటన హైలైట్స్ గా నిలిచిన ఈ సినిమాని ఈ పండగకి పిల్లలు, పెద్దలు అందరూ తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లోని అమ్మ నాన్నల కథ, ఈ తరం, రేపటి తరం తెలుసుకోవాల్సిన గొప్ప కథ.

రంగమార్తాండ మూవీ ట్రైలర్ :

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here