గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ

geethanjali malli vachindi movie telugu review

శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో అంజ‌లి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. దీంతో సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే అప్ డేట్లతో సినిమాపై మంచి బజ్ నే క్రియేట్ చేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది లాంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. అంజలి, రాహుల్ మాధవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌, స‌త్య‌, సునీల్‌, ర‌విశంక‌ర్‌, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
దర్శకత్వం..శివ తుర్ల‌పాటి
బ్యానర్..ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌
నిర్మాత..ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ
సినిమాటోగ్రఫి..సుజాత సిద్ధార్థ
సంగీతం..ప్రవీణ్ లక్కరాజు

కథ

శ్రీను (శ్రీనివాస్ రెడ్డి), ఆరుద్ర (షకలక శంకర్), ఆత్రేయ (సత్యం రాజేష్)లు సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. మరోవైపు అయాన్ (సత్య) హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. దాని కోసం తన ఫ్రెండ్స్ అయిన శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలకు బాగానే ఖర్చు పెడతాడు. అలాంటి టైంలోనే శ్రీనుకి ఊటిలోని వ్యాపారవేత్త విష్ణు ( రాహుల్ మాధవ్) నుంచి సినిమా తీయాలనే ఆఫర్ వస్తుంది. అంతేకాదు సినిమా షూటింగ్ ను అదే ఊర్లో ఉన్న సంగీత్ మహల్‌లో చేయాలని అంటాడు. ఇక హీరోయిన్ గా అక్కడే కాఫీ హోటల్‌ను నడుపుతున్న అంజలి (అంజలి)ని ఒప్పిస్తారు. అలా షూటింగ్ కోసం సంగీత్ మహల్ కు వెళ్లిన టీమ్ కు పలు సంఘటనలు ఎదురవుతాయి. అసలు సంగీత్ మహల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అక్కడ జరుగుతున్న హత్యల వెనుకున్న కథ ఏంటి? ఈ విష్ణు బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంజలి, శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలను ఎందుకు ఒక చోటకు తీసుకొచ్చారు? అన్నది ఈసినిమా కథ.

విశ్లేషణ

కామెడీ ప్లస్ హార్రర్ జోనర్ అంటే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే జోనరే. అందుకే ఈమధ్య కాలంలో ఇలాంటి జోనర్ లో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇక ఆ జోనర్ కు చెందినదే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా. ఈసినిమా గీతాంజలి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. గీతాంజలి సినిమా కూడా కామెడీ హార్రర్ జోనర్ లోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తరువాత ఈసినిమా సీక్వెల్ తో వచ్చారు.

ఇక ఈ సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. బేసిక్ గా ఇలాంటి సినిమాలకు లాజిక్స్ అనేవి ఉండవు. ప్రేక్షకులను అలరించడమే మెయిన్ మోటోగా ఉంటుంది. అలా ఈ సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడంలో మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కాస్త నార్మల్ గా నడిచినా ఇంటర్వెల్ తరువాత నుండి సినిమా ఊపు అందుకుంటుంది. . సంగీత్ మహల్‌లో సినిమా షూట్ ప్రారంభమయ్యే సీన్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అదిరిపోతుందంతే. ప్రతీ సీన్‌కు నవ్వేస్తుంటారు.

పెర్ఫామెన్స్
నటీనటులు పెర్ఫామెన్స్ విషయానికి వస్తే ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పలేం. హీరోయిన్ గా చేసిన అంజలి బాగానే చేసింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్య కామెడీ టైమింగ్ గురించి. ఎప్పటిలాగే సత్య తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. ఇక సునీల్ కు కూడా చాలా కాలం తరువాత మంచి కామెడీ పాత్ర దక్కింది. రవి శంకర్, ప్రియా పాత్రలు మెప్పిస్తాయి. రాహుల్ మాధవ్ విలన్‌గా ఓకే అనిపిస్తాడు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, శ్రీకాంత్ అయ్యంగార్, అవినాష్, పవిత్ర తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా కలిసొచ్చింది. పాటలు సంగతి పక్కన పెడితే ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ హార్రర్ ఎంటర్ టైనర్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ను పక్కన పెట్టి సినిమాను చూస్తే మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఈసినిమా అన్ని వర్గాల వారికి నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =