దేశవ్యాప్తంగా మంగళవారం (ఏప్రిల్ 23, 2024) హనుమంతుడి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంజనీ పుత్రుడి ఆశీస్సులు అందుకునేందుకు భక్త జనం ఆలయాలకు బారులుతీరుతున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు, భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదే క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇరువురూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టులు పెట్టి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని తెలియజేశారు.
అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ! ఆ హనుమంతుడి అకుంఠిత దీక్ష , కార్యదక్షత,సూక్ష్మ బుద్ధి, ధైర్య సాహసాలు మనందరికీ ఎల్లపుడూ స్ఫూర్తి దాయకం🙏🙏
Happy #HanumanJayanti ! pic.twitter.com/A7Ek6JpkTA
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2024
Wishing you strength & happiness this Hanuman Jayanti.
Jai Shri Ram!! pic.twitter.com/qV5waWwz40
— Ram Charan (@AlwaysRamCharan) April 23, 2024
కాగా మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడిపై ఎంత భకిప్రపత్తులు ఉంటాయో ప్రత్యేకిఞ్చి చెప్పనక్కర్లేదు. ఆ పవన సుతుడిపై ఉన్న అభిమానంతో ఆయన కొణిదెల శివ శంకర వరప్రసాద్ అని తల్లిదండ్రులు పెట్టిన తన పేరుని చిరంజీవిగా మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇదిలావుండగా.. ప్రస్తుతం మెగాస్టార్ మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మరోవైపు రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అనే పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: