రౌడీ బాయ్స్ రీ రిలీజ్ కు సూపర్ రెస్పాన్స్

rowdy boys re release gets super response

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా అని లేదు పెద్ద సినిమా అని లేదు అన్ని సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రీ రిలీజ్ అయిన సినిమా రౌడీ బాయ్స్. హుషారు సినిమా ఫేం శ్రీహ‌ర్ష క‌నుగంటి ద‌ర్శ‌క‌త్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చింది ఈసినిమా. ఈసినిమాతోనే ఆశిష్ రెడ్డి హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈసినిమా మంచి హిట్ నే అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను రీసెంట్ గానే రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే రీ రిలీజ్ లో మాత్రం ఈసినిమా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అంతేకాదు కొన్ని ఏరియాల్లో కొత్త థియేటర్లు లను సైతం యాడ్ చేస్తున్నారు. మరి రీ రిలీజ్ లో కూడా ఎక్ట్సా థియేటర్లు యాడ్ చేయడం అంటే గొప్ప విషయమనే చెప్పాలి.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ఇంకా సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్, అయ్యంగార్, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మించగా..లసంగీతం.. దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫి..మది అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 6 =