రివ్యూ :మంజుమ్మల్ బాయ్స్ 

manjummel boys telugu review

నటీనటులు : శ్రీనాథ్ భాసి,బాలు వర్గీస్ ,గణపతి,దీపక్ పరంబోల్ , సౌబిన్ షాహిర్
ఎడిటింగ్ : వివేక్ హర్షన్
సంగీతం : సుశీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ : షైజు ఖలీద్
దర్శకత్వం : చిదంబరం
నిర్మాతలు : బాబు షాహిర్ ,షాన్ ఆంటోనీ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా పేరు సౌత్ లో బాగా మారుమోగిపోయింది.చిన్న సినిమాగా మలయాళంలో తెరకెక్కిన ఈసినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.ఒక్క కేరళ లోనే  కాదు తమిళనాడులో కూడా హావ కొనసాగించింది.ఇక ఇప్పుడు తెలుగులోకి వచ్చింది. బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ ,ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఈసినిమాను తెలుగులోకి తీసుకొచ్చాయి.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎలా వుంది? మలయాళం లోలాగా ఇక్కడ  కూడా మ్యాజిక్ క్రీయేట్ చేయగలిగిందా? తెలుగు ప్రేక్షకులకు ఈసినిమా కనెక్ట్ అయ్యిందా లేదో తెలుసుకుందాం.

కథ :
కొచ్చి చెందిన ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు.వీరి గ్యాంగ్ కు మంజుమ్మల్ బాయ్స్ అనే పేరు వస్తుంది.వీరంతా కలిసి తమిళనాడులోని కొడైకెనాల్ కు టూర్ కు వెళ్తారు.అంతటి తో ఆగకుండా నిషేదిత ప్రాంతం గుణ కేవ్స్ చూడడానికి  వెళ్లాలనుకుంటారు.ఇందులో చాలా ప్రమాదకరమైన లోయలు ఉంటాయి.ఈ గ్యాంగ్  పోలీసుల కళ్ళు కప్పి ఆ కేవ్స్ లోకి వెళ్లగా అందులో ఒకరైన సుభాష్ ప్రమాదకరమైన లోయలో పడిపోతాడు. అప్పటివరకు అందులోకి వెళ్ళినవారు ప్రాణాలతో బయటపడటం జరుగలేదు. మరి అంతటి ప్రమాదం నుండి మంజుమ్మల్ బాయ్స్ తమ ఫ్రెండ్ ను ఎలా కాపాడుకున్నారు,దాని కోసం వారి  చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది మిగితా కథ.

విశ్లేషణ : 

ఇది కేరళ లో జరిగిన వాస్తవిక సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్.ఇలాంటి కథలను ఎంత ఉత్కంఠగా చూపిస్తే అంత సక్సెస్ అవుతుంది.అందుకేనేమో 20కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈసినిమా 200కోట్ల వసూళ్లను రాబట్టింది.ఇక ఈకథ తెలుగు వారికి కూడా బాగా కనెక్ట్ అవుతుంది.అందరు కొత్తవారే అయినా సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి వారి తో ట్రావెల్ చేస్తాం అయితే ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు కొంత గందరగోళానికి గురిచేస్తాయి.ఎప్పుడైతే కథలోకి వెళ్తుందో ఇక ఆక్కడినుండి అదరగొట్టింది.

ప్రమాదకర లోయలో పడ్డ తన స్నేహితుడి ని కాపాడటానికి ఫెండ్స్ గ్యాంగ్ చేసే పనులు మెప్పిస్తాయి.చాలా సహజంగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు.చివరి నిమిషం వరకు ఏమవుతుందో అనే ఉత్కంఠను క్రియేట్ చేయడంతో ఎక్కడా బోర్ కొట్టదు.ముఖ్యంగా సెకండ్ హాఫ్ కట్టిపడేస్తుంది.పెద్దగా ట్విస్టులు లేకున్నా సినిమా ఆకట్టుకుంటుంది.ఓవరాల్ గా చెప్పాలంటే మంజుమ్మల్ బాయ్స్ వన్ అఫ్ ది బెస్ట్ సర్వైవల్ థ్రిలర్ అని చెప్పొచ్చు.ప్రేమలు లాగా ఈసినిమాకూడా తెలుగులో సూపర్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయం.

నటీనటల విషయానికి వస్తే  ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరు చాలా బాగా చేశారు.చాలా నాచురల్ గా నటించారు. అందరికి స్క్రీన్ పై ఇంపార్టెన్స్ దొరికింది.వీళ్లు చేసే అల్లరి, వాళ్ళ స్నేహం బాగా కనెక్ట్ అవుతాయి.సాంకేతికంగా గా కూడా సినిమా బ్రిలియంట్ అనిపించింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేయగా ఛాయాగ్రహణం  సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది.ఎడిటింగ్ కూడా బాగుంది.నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

ఓవరాల్ గా మళయాలం లో రికార్డులు క్రీయేట్ చేసి తెలుగులోకి వచ్చిన ఈసినిమా తెలుగు ప్రేక్షకులకు  కూడా బాగా కనెక్ట్ అవుతుంది.మీ గ్యాంగ్ తో వెళ్లి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 2 =