నటీనటులు : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్,జగపతి బాబు,వెన్నల కిషోర్
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్
సినిమాటోగ్రఫీ : కె యు మోహనన్
సంగీతం :గోపిసుందర్
దర్శకత్వం : పరుశురాం
నిర్మాత : దిల్ రాజు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ దేవరకొండ,పరుశురాం కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.ఇక అప్పటినుండి విజయ్ ఆ తరహా విజయం కోసం ఎదురుచూస్తూనేవున్నాడు.అయితే అలాంటి విజయం కోసం ఇప్పుడు మళ్ళీ పరుశురాంతోనే రెండో సినిమా చేశాడు అదే ది ఫ్యామిలీ స్టార్. వీరికి తోడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈసినిమాను నిర్మించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.మరి ఈ రోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
గోవర్ధన్ ( విజయ్ దేవరకొండ )ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ బాధ్యతలను మోసుకుంటూ ఇంటిని చక్కదిద్దే పనిలో ఉంటాడు. ఈక్రమంలో గోవర్ధన్ ఇంట్లోకి ఇందు (మృణాల్ ఠాకూర్)అద్దె కు దిగ్గుతుంది.గోవర్ధన్ కు వున్న మిడిల్ క్లాస్ మెంటాలిటీ వల్ల తనకు ఇందు నచ్చదు.ఒకానొక సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో ఇందు ఆ ఇంట్లోనుండి వెళ్ళిపోతుంది.అయితే ఇందు, గోవర్ధన్ ఇంట్లో దిగడానికి ఓ కారణం ఉంటుంది. కట్ చేస్తే ఓ ప్రాజెక్ట్ పనిమీద ఇందుతో కలిసి గోవర్ధన్ తో కలిసి యూఎస్ కు వెళ్లాల్సి వస్తుంది. ఆతరువాత ఏమైంది? వీరిద్దరూ ఒక్కట్టయ్యారా? గోవర్ధన్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ను క్లియర్ చేసి ఏవింధంగా ఫ్యామిలీ స్టార్ అనిపించుకున్నాడు అనేది మిగితా కథ.
విశ్లేషణ :
ఫ్యామిలీ స్టోరీలను ఎలా చూపెడితే సక్సెస్ అవుతాయో దర్శకులకు బాగా తెలిసివుండాలి.గీత గోవిందం విషయంలో పరుశురాం ఇది చేసి చూపెట్టాడు.దాంతో ఆ సినిమా 100కోట్లు రాబట్టింది.ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ను కూడా అదే తరహాలో తెరకెక్కించాడు అయితే ఈసినిమా విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ లాంటి ఫాలోయింగ్ వున్న హీరోను మద్యతరగతి కుర్రాడిలా బాగా చూపించాడు.
విజయ్ ఈసినిమాను తన భుజాలపై మోశాడు.ప్రారంభంలో డబ్బులు మిగిల్చుకోవడం కోసం విజయ్ చేసే పనులు ఫ్యామిలీ ఆడియన్స్ ను నచ్చేస్తాయి.మధ్యలో కొంచెం స్లో అయినా ఫీలింగ్ కలుగుతుంది అయితే ఇంటర్వెల్ నుండి వేగం పుంజుకుంటుంది.సెకండ్ హాఫ్ అంతా యూఎస్ లోనే ఉంటుంది.ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు.ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ ప్రతి మిడిల్ క్లాస్ కుర్రాడి కథ.ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్ కూడా నచ్చే సినిమా ఇది.
నటీనటులు విషయానికి వస్తే విజయ్ దేవరకొండ సినిమాకు మెయిన్ పిల్లర్.గోవర్ధన్ పాత్రలో అదరగొట్టాడు.తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.ఎక్కడా ఓవర్ అనిపించకుండా చాలా సెటిల్డ్ గా నటించాడు.యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ సూపర్ అనిపించింది.స్క్రీన్ పై విజయ్ -మృణాల్ పెయిర్ ఫ్రెష్ గా కనిపించింది.ఇక జగపతి బాబు తనకు అలవాటైన పాత్రలో కనిపించగా వెన్నల కిషోర్ అక్కడక్కడా నవ్వించాడు.
టెక్నికల్ విషయానికి వస్తే గోపిసుందర్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.ఎడిటింగ్ డీసెంట్ అనిపించగా కె యు మోహనన్ విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి.ఇక దిల్ రాజు నిర్మాణం గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది సినిమాకు బాగానే ఖర్చు చేశారు.
ఓవరాల్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ లో విజయ్ నటన ,విజయ్ -మృణాల్ ల కెమిస్ట్రీ ,సంగీతం హైలైట్ అయ్యాయి.ఈసమ్మర్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే ఫ్యామిలీ స్టార్ ను చూసేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: