లవ్ గురు రివ్యూ-కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

vijay antony love guru movie telugu review

వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన సినిమా లవ్ గురు. అప్ డేట్లతోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమాా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. విజయ్ ఆంటోని, మృణాళిని రవి,వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు
దర్శకత్వం.. వినాయక్ వైద్యనాథన్
బ్యానర్స్..విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్
నిర్మాతలు.. మీరా విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫి.. ఫరూక్ జే బాష
సంగీతం..భరత్ ధనశేఖర్

కథ
అరవింద్ (విజయ్ ఆంటోని) మలేసియాలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక బాధ్యతల వల్ల వ్యక్తిగత జీవితం గురించి మరిచిపోయిన అరవింద్ ఫైనల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని సొంత ఊరు సింహాచలం వెళతాడు. ఈనేపథ్యంలోనే తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి) ని చూసి ప్రేమలో పడతాడు. దీంతో అరవింద్ తల్లి దండ్రులు లీల తండ్రితో మాట్లాడి పెళ్లిని ఫిక్స్ చేస్తారు. కానీ లీలకు మాత్రం పెద్ద హీరోయిన్ అవ్వాలని ఉంటుంది. లీల తండ్రికి మాత్రం అది ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్ తో పెళ్లి చేస్తాడు. పెళ్లి అయిన తరువాత కూడా లీల అరవింద్ ను దూరం పెడుతుంది. మరి ఆ తరువాత అరవింద్ కు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి..? లీల కు దగ్గర అవ్వడానికి ఏం చేశాడు..? లీల హీరోయిన్ అవ్వాలన్న కల ఏమవుతుంది? ఫైనల్ గా వీరిద్దరి ఎలా ఒకటవుతారు? అనేదే ఈసినిమా కథ..

విశ్లేషణ

విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే అందులో ఏదో విభిన్నత ఉంటుందనే పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేశాడు. అయితే గత కొద్ది కాలంగా కాస్త యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన విజయ్ ఆంటోని ఇప్పుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. ఈ జోనర్ లో విజయ్ ఆంటోని నుండి పెద్దగా సినిమాలు వచ్చింది లేదు.. దీంతో సినిమాపై మొదటినుండీ మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈసినిమా రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతం చేసుకుంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తతో ఉండలేక ఇబ్బంది పడితే, ఆమెకి దగ్గరయ్యేందుకు భర్త చేసే ప్రయత్నం ఏంటనేదే మెయిన్ థీమ్. ఈ పాయింట్ తో తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అయితే ఈ కథను ఎంటర్ టైనింగ్ తో పాటు ఎమోషనల్ గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భార్యాభర్తల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని కామెడీ సీన్స్ అండ్ డైలాగ్స్,
సిస్టర్ సెంటిమెంట్ ఇవన్న లవ్ గురు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఫస్టాఫ్ కాస్త సింపుల్ గా సాగినా సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ ను ఎమోషనల్ గా ముగించారు.

పెర్ఫామెన్స్
విజయ్ ఆంటోని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. నటుడిగా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఈసినిమాలో అరవింద్ పాత్రలో మరోసారి తన నటనతో మెప్పించాడు. భార్య ఎంత వద్దనుకున్నా ప్రేమతో ఆమెకు దగ్గరవ్వాలని, ఆమె కోసం ఏదైనా చేయాలనే భర్త పాత్రలో విజయ్ ఆంటోని జీవించేసాడని చెప్పొచ్చు. కామెడీ కూడా బాగా చేస్తాడని ప్రూవ్ చేశారు. ఇక లీల పాత్రలో మృణాళిని తన పాత్రకు న్యాయం చేసింది. ఇక హీరో మామయ్యగా వీటీవీ గణేష్‌ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఆయన పాత్ర సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఇక యోగిబాబు తో పాటు మిగిలిన వారు తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
సాంకేతిక విభాగానికి వస్తే ఫరూక్ జే బాష అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. డబ్బింగ్ కాబట్టి పాటలు పెద్దగా ఎక్కవు.. పాటలు సంగతి పక్కనపెడితే భరత్ ధనశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ఎడిటర్ విజయ్ ఆంటోనియే కాబట్టి పెద్దగా ల్యాగ్ లేకుండా కట్ చేశారు. నిర్మాణ విలువులు కూడా బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే లవ్ గురు సినిమా కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఈసినిమాను అన్ని వర్గాల వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 9 =