ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండటం కామన్. ఎలాగూ సెలవులు ఉంటాయి కాబట్టి సంక్రాంతికి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ముందుగా జనవరి 12వ తేదీన గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు రిలీయ్ అయ్యాయి. రెండు సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతంచేసుకున్నాయి. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్లలో వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాగా.. హనుమాన్ మూవీ సూపర్ హీరోస్ నేపథ్యంలో వచ్చింది. రెండు సినిమాలు కూడా మంచి హిట్ ను అందుకున్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి. ఇక జనవరి 13వ తేదీన వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా రిలీజ్ అయింది. ఇక యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా డీసెంట్ టాక్ నే సొంతం చేసుకుంది. జనవరి 14వ తేదీన నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా రిలీజ్ అయింది. మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. మరి ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”113723″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: