దేశరాజధానిలో థగ్ లైఫ్ కొత్త షెడ్యూల్

kamal haasan thug life movie new schedule started in delhi

లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. థగ్ లైఫ్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. అయితే గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే కదా. దీనికి కారణం తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు ఉండటమే. ఈ కారణం చేత ఈసినిమా షూటింగ్ ను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు తొలి ద‌శ‌లో ఎన్నిక‌లు పూర్త‌వ్వ‌డంతో ఈ సినిమా షూటింగ్‌ను మ‌ళ్లీ ప్రారంభించారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఢిల్లీలో మొదలైంది. ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ తమ సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.

కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్ కూడా నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 7 =