ఖుషి రిలీజ్ డేట్ ఫిక్స్

vijay devarakonda and samantha kushi movie release date fixed

ప్రస్తుతం రాబోతున్న క్రేజీ కాంబినేషన్స్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ కూడా ఒకటి. ఇప్పటికే సమంత హిట్లతో మంచి ఫామ్ లో ఉంది. అయితే విజయ్ దేవకొండ మాత్రం హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వీరిద్దరూ మహానటి సినిమాలో జోడీగా కనిపించారు. అయితే ఆసినిమాలో నిడివి తక్కువగానే ఉంటుంది కానీ వీరి కాంబినేషన్ ఆకట్టుకుంటుంది. ఈనేపథ్యంలో వీరిద్దరితో శివ నిర్వాణ ఖుషి అనే సినిమాతో వస్తున్నాడు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు కానీ మధ్యలో సామ్, విజయ్ వారి ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటంతో షూట్ కు బ్రేక్ పడింది. ఆ తరువాత సమంత అనారోగ్యానికి గురవ్వడంతో మరింత లేట్ అయింది. ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ మళ్లీ ఈమధ్యనే రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fourteen =