విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ధమ్కీ. సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేశాడు విశ్వక్ సేన్. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు
దర్శకత్వం.. విశ్వక్ సేన్
బ్యానర్స్..వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్
నిర్మాతలు..కరాటే రాజు
సినిమాటోగ్రఫి..దినేష్ కే బాబు
సంగీతం..లియోన్ జేమ్స్
కథ
కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్ గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఒకరోజు హోటల్ కు వచ్చిన కీర్తీని (నివేదా పేతురాజ్) చూసి ప్రేమలో పడతాడు. ఇక తను వెయిటర్ అనే విషయం కూడా దాటిపెట్టి ఆమెను ప్రేమలో పడేయడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ తను వెయిటర్ అనే విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఉద్యోగం పోతుంది. ఇంటి ఓనర్ బయటకు పంపించేస్తాడు. ఇలాంటి సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) పాత్రలో నటించమని అడుగుతాడు. మరి అతడి స్థానంలోకి కృష్ణదాస్ వెళ్లిన తర్వాత ఏమైంది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? కృష్ణ దాస్ నే నటించమని ఎందుకు అడుగుతాడు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
విశ్వక్ సేన్ ఇప్పటికే అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. ఫలక్ నామా దాస్ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే తన సత్తా చూపించాడు. ఇక ఆతరువాత వరుసగా హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. మళ్లీ ఇప్పుడు డైరెక్టర్ గా హీరోగా వచ్చాడు.
ఇక డైరెక్టర్ గా మరోసారి విశ్వక్ సేన్ సక్సెస్ కొట్టాడు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఇక సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి మూవీ టెంపో, వరుస ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్‌గా ఉండటంతో పాటు విశ్వక్ సేన్ పెర్ఫామెన్స్ కూడా హైలెట్ గా నిలుస్తుంది.
పెర్ఫామెన్స్
విశ్వక్ సేన్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో చేసుకుంటూ వెళ్లాడు. మొదటి సారి డ్యూయల్ రోల్‌లో నటించినా చాలా బాగా చేశాడు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించాడు. నెగిటివ్ షెడ్స్ పాత్రలో బాగా చేశారు. నివేతా పేతురాజ్ ఇంతవరకూ కనిపించనంత గ్లామర్ పాత్రలో నటించింది. ఆమె పాత్రలోని ట్విస్టు కూడా ఆడియెన్స్‌కు నచ్చుతుంది. రావు రమేష్, అజయ్, రోహిణి, థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు చక్కగా యాక్ట్ చేశారు. హైపర్ ఆది, రంగస్థలం మహేష్ తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.
సాంకేతిక విభాగం..
ఈసినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రసన్న డైలాగ్స్ అందిచాడు. మరోసారి తన రైటింగ్ స్కిల్స్ సినిమాలో చూపించాడు. స్క్రీన్ ప్లే కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. లియోనే జేమ్స్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా బిగ్ స్క్రీన్ పై కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు హైలెట్ అవుతుంది. దినేష్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అందించారు.
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ తో పాటు ట్విస్ట్ లను ఎంజాయ్ చేసేవారు ఈసినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక హీరోగా, డైరెక్టర్ గా విశ్వక్ సేన్ మరోసారి తన మార్క్ ను చూపించగలిగాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: