పుష్ప2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

pushpa 2 movie first single release date fixed

అల్లు అర్జున్ నుండి రానున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక ఈసినిమాతో అల్లు అర్జున్ రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప 2 కోసం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో అప్ డేట్ కోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే ఫస్ట్ సింగిల్ ప్రోమో అప్ డేట్ వస్తుందని అప్ డేట్ ఇచ్చారో అప్పటి నుండి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ టైమ్ రానే వచ్చేసింది. తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప పుష్ప అంటూ వచ్చిన ఈప్రోమో బాగానే ఉంది. ఇక ఫుల్ సాంగ్ ను మే1వ తేదీన 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 2 =