తమిళ్ స్టార్ హీరో విశాల్ ఇటీవలే ‘మార్క్ ఆంటోని’తో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విశాల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల క్లబ్ మూవీగా నిలిచింది. దీని తర్వాత ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రత్నం’. మాస్ యాక్షన్ సినిమాలు తీయడంలో పేరొందిన సీనియర్ డైరెక్టర్ హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ‘రత్నం’ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి 15న ఈ మూవీ నుంచి ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ అనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 26వ తేదీన గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: