ఓదెల2 సెకండ్ షెడ్యూల్ మొదలు

odela 2 movie second schedule began today

అశోక్ తేజ్ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఓదెల2. ఈసినిమా ఓదెల రైల్వేస్టేషన్‌ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2022 లో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా మంచి ప్రశంసలే దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా ఓదెల2 సినిమా వస్తుండటంతో దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే శివరాత్రి సందర్భంగా తమన్నా లుక్‌ ను రిలీజ్ చేయగా తమన్నా లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓదెల 2లో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టినట్టు తెలిపారు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ను జరపనున్నారు. దాదాపు మూడు వారాల పాటు జరిగే ఈషెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో అయితే ఆకట్టుకుంటుంది. అజనీష్ లోక్‌నాథ్ అద్భుతమైన స్కోర్‌తో తమన్నా పాత్రలోకి మారడాన్ని చూపించే వర్కింగ్ వీడియో గూజ్ బంప్స్ అందిస్తుంది. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని అర్ధమౌతోంది

కాగా ఈసినిమాలో ఇంకా వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − two =