షూటింగ్ చివరి దశలో విజయ్ గోట్

vijay goat movie shooting Nearing Completion

దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ను ఏప్రిల్ చివరికల్లా పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆదిశగానే షూటింగ్ పూర్తిచేస్తున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. ఈ మధ్యనే ఒక పాటను చిత్రీకరించారని.. దాంతో షూటింగ్ దాదాపు కంప్లీట్ దశకు వచ్చిందని అంటున్నారు.

కాగా సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =