నితిన్ తమ్ముడు షూటింగ్ అప్డేట్ 

Thammudu heavy action episode started in RFC

వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ,యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఈసినిమా షూటింగ్  ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్  ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.ఇందుకోసం  ఏకంగా 8కోట్ల వరకు ఖర్చుపెడుతున్నారట. నితిన్ కెరీర్ లో ఓ ఫైట్ సీన్స్ కోసం ఇంతపెద్ద మొత్తం లో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. ఈషెడ్యూల్ 10రోజులు జరుగనుంది.సినిమాలో ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవ్వనుందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రదర్ -సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈసినిమాలో నితిన్ అక్కగా లయ నటిస్తుండగా  కాంతారా ఫేమ్ సప్తమి గౌడ  హీరోయిన్ గా నటిస్తుంది.అజినీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది ద్వితీయార్థంలో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక నితిన్ ఈసినిమా కాకుండా రాబిన్ హుడ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.వెంకీ కుడుముల ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ  బ్లాక్ బాస్టర్ అయ్యింది. దాంతో రాబిన్ హుడ్ పై మంచిఅంచనాలు వున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమా నిర్మిస్తుండగా డిసెంబర్ 20న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =