రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో మొగలి రేకులు ఫేమ్ ఆర్కె సాగర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి విశేష స్పందన లభించింది. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనా దేవి లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐపీఎస్ అధికారి విక్రాంత్ చేసిన తప్పులపై మానవ హక్కుల కమిషన్ విచారించడంతో టీజర్ ప్రారంభమైంది. నగర శివార్లలో కొన్ని సామూహిక హత్యలు జరుగుతాయి. అందులో వారంతా రౌడీ షీటర్లు. పోలీసుల విచారణ జరుగుతోంది. నేరస్థులను ఎదుర్కోవడంలో తనదైన స్టయిల్ కలిగి ఉన్న హీరో తన పద్దతి గురించి మీడియా లేదా ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. అతను ఉన్నతాధికారుల, మానవ హక్కుల కమిషన్‌కు కూడా భయపడడు. తనున్న చోట నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి స్వభావాన్ని తెలియజేసేలా టీజర్ ఉంది. ఆర్కే సాగర్ ఖాకీ దుస్తులలో ఫిట్‌గా కనిపించారు. అతని ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ యుఎస్పీ. రాఘవ్ ఓంకార్ శశిధర్ క్యారెక్టర్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా గ్రిప్పింగ్ కథనంతో యాక్షన్‌లో ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
సాగర్ మా అమ్మ అంజనమ్మ గారు లాంచ్ చేసిన నీ 100 మూవీ ట్రైలర్ చూసాను,మా అమ్మ ఆశీస్సులతో పాటు మా అన్నదమ్ముల సపోర్ట్ కూడ ఎప్పుడు మీకు ఉంటుంది,ట్రైలర్ మాత్రం చాలా బావుంది
All the Best….#The100 teaser looks powerful 🔥
Best wishes to @urRksagar and entire #THE100movie team!Watch… pic.twitter.com/qC3wZPs6k4
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 26, 2024
కాగా ఈసినిమాలో మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల్ స్వామి, కళ్యాణి నటరాజన్, బాల కృష్ణ, జయంత్, విష్ణు ప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈసినిమాను క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫి, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్. చిన్నా ప్రొడక్షన్ డిజైనర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: