ఇప్పుడు తెలుగు మేకర్స్ తమిళ్ హీరోలతో, తమిళ్ హీరోలు తెలుగు మేకర్స్ తో సినిమాలు చేయడం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలా కాంబినేషన్స్ వచ్చాయి.. కొన్ని కాంబినేషన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వబోతుంది. ఆ కాంబినేషన్ ఏదో కాదు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా రావడం. ఈసినిమాపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ను ఈసినిమాకు ఖరారు చేశారు. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచేశారు. మరోవైపు రిలీజ్ డేట్ ను కూడా ఇప్పుడే ప్రకటించడం విశేషం. 2025 పొంగల్ కు ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
With Wholesome Humbleness herewith, we Announce the title of AK’s Next Movie Called as #GoodBadUgly #AjithKumar @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl@SureshChandraa @supremesundar#kaloianvodenicharov #Anuvardhan @valentino_suren@Donechannel… pic.twitter.com/EU4qKO5fEO
— Mythri Movie Makers (@MythriOfficial) March 14, 2024
అధిక్ రవి చంద్రన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు అభినందన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. తమిళ్ ఇంకా తెలుగులో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: