రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నా – ప్రశాంత్ వర్మ

Director Prasanth Varma Says, I Will Spend Next 20 Years on PVCU

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ నేను నమ్మలేదు. కాకపొతే మీరంతా దాన్ని నిజం చేశారు. ఇంద్ర, సమరసింహా రెడ్డి, నువ్వునాకు నచ్చావ్, ఖుషి, పోకిరి నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు” అని గుర్తుచేసుకున్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నేను డైరెక్టర్ అయిన తర్వాత సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది. అలాంటి ఈ జనరేషన్ లో వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే చాలా అదృష్టంగా ఫీలౌతున్నాను. హనుమాన్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అని మొదటి నుంచి చెప్పాం. దాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా వుంది. ఈ వంద రోజుల్లో ప్రతి రోజు సినిమా తొలి రోజుకు వచ్చిన స్పందనే లభిస్తోంది. ఇంత అదృష్టాన్ని కల్పించిన హనుమంతుల వారికి, రాములవారికి రుణపడి వుంటాను. తేజ, నిరంజన్ గారు, వరు, సముద్రఖని గారు టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని తెలిపారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) గురించి..

“పీవీసియూకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది చాలా కాలంగా కన్న కల. రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నాను. ఈ యూనివర్స్‌లో మీరు చూసే పాత్రలు మళ్ళీ రాబోతున్నాయి. సముద్రఖని గారు విభీషణుడిగా కనిపించబోతున్నారు. తేజ హను-మాన్‌గా కొనసాగుతారు. కొన్ని సర్‌ప్రైజ్ పాత్రలు కూడా రాబోతున్నాయి. పీవీసియూలో అన్ని పరిశ్రమల నుంచి చాలా పెద్ద స్టార్స్ కనిపించబోతున్నారు. పీవీసియు నుంచి వచ్చే సినిమాలు మీ అందరి అంచనాలు అందుకొని మిమ్మల్ని ఆనందపరుస్తాయి. తెలుగు ఆడియన్స్ గర్వపడేలా చేస్తామని నమ్మకంగా చెబుతున్నాను. ‘జై హనుమాన్’ని బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ అన్నీ వుంటాయి. మీరు ఇలానే సపోర్ట్ చేసి ఆ సినిమాని వంద రోజులు ఆడేలా చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.. జై హనుమాన్’ అని దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 1 =