సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్న ఈ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కేరింతల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. గుంటూరు వైబ్స్ మామూలుగా లేవు. అప్పుడే సంక్రాంతికి సినిమా విడుదలైన వైబ్స్ కనిపిస్తున్నాయి. ముందుగా మా మిత్రుడు, నిర్మాత చినబాబు గారికి థాంక్యూ వెరీ మచ్. చినబాబు గారు ప్రతి సినిమాని ఎంతో శ్రద్ధగా తీస్తూ, విజయాలు సాధిస్తున్నారు. అలాగే చినబాబు గారికి వంశీ తోడుగా ఉంటూ.. హారిక అండ్ హాసిని, సితార బ్యానర్లపై మంచి సినిమాలు అందిస్తున్నారు. నిర్మాతలుగా రాణించడం అంత తేలిక లేదు. ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ వారిద్దరి ప్రయాణం అద్భుతంగా ఉంది. వారికి తోడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు. ఆ బ్యానర్ల నుంచి వచ్చే సినిమాల విజయం వెనుక త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. ఎన్నో మంచి సినిమాలు అందిస్తున్న మీ అందరికీ కృతఙ్ఞతలు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. థమన్ సంగీతంతో అదరగొడుతున్నాడు. ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు మహేష్ గారు, శ్రీలీల వేసే డ్యాన్స్ లకు థియేటర్లలో స్క్రీన్ లు చిరిగిపోతాయి. త్రివిక్రమ్ గారు నాకు కొన్ని సన్నివేశాలు చూపించారు. పాటలు మాత్రమే కాదు.. నేపథ్య సంగీతం కూడా థమన్ మామూలుగా ఇవ్వలేదు. థియేటర్లకు వెళ్ళేటప్పుడు పేపర్లు ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఆ సన్నివేశాలకు పేపర్లు సరిపోవు. శ్రీలీల ఎనర్జీ గురించి మీ అందరికీ తెలిసిందే. నేను కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూశాను. మామూలుగా లేదు. త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాతో ఏదో మాయ చేస్తారు. మనల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి, హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. త్రివిక్రమ్ గారు అద్భుతమైన సినిమా తీస్తున్నారు. మహేష్ బాబు గారు ఈ సినిమాతో కలెక్షన్ల తాట తీస్తాడు” అని చెప్పారు.
దిల్ రాజు ఇంకా ఇలా అన్నారు.. “ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు హీరో క్యారెక్టర్ ని రాసిన విధానం బాగుంది. పోకిరి, దూకుడు వంటి సినిమాల తరహాలో మహేష్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ గారు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు. సిద్ధంగా ఉండండి. ఈ సంక్రాంతి మహేష్ గారి అభిమానులకు చాలా పెద్ద పండగ. ఈ మధ్య ప్రతి సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ ఇరగదీస్తున్నారు మహేష్ గారు. అది మీకోసమే. ఈ సినిమాలో కుర్చీ పాట మిమ్మల్ని బాగా అలరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులను ఈ గుంటూరు కారం కట్టిపడేస్తుంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ వస్తుంది. రెడీగా ఉండండి” అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: