లవ్ మీ- స్టూపిడ్ హార్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Love Me Movie Stupid Heart Song Release Date

ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆశిష్. అందులో లవ్ మీ సినిమా ఒకటి. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసినిమా ఈపాటికే రిలీజ్ అయి ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. మే 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. రావాలి రా, ఆటగదరా శివ పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలు మంచిగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈసినిమా నుండి స్టూపిడ్ హార్ట్ అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. రేపు అంటే మే3వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =