ఎంత మంది హీరోయిలతో చేసినా కొంతమంది డైరెక్టర్లకు కూడా పలానా హీరోతే చేయాలనో.. పలానా హీరోయిన్ తో చేయాలనో అనుకుంటారు. తమ డ్రీమ్ ను నెరవేర్చుకుంటారు. ఇక ఇక్కడ ఓ డైరెక్టర్ కు కూడా డ్రీమ్ కాస్టింగ్ ఉంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. తమిళ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. గత ఏడాది రజనీకాంత్ తో జైలర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు నెల్సన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాాజాగా ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న నెల్సన్ ను తన డ్రీమ్ కాస్ట్ గురించి అడగగా దానికి నెల్సన్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నాకు కనుక తమిళ్ స్టార్ హీరో విజయ్ 79 ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అందులో టాలీవుడ్ నుంచి మహేశ్‌బాబు, బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, మలయాళం టాప్ హీరో మమ్ముట్టిలకు కీలక పాత్రలు రాస్తాను. అది నా కల. అందులో మహిళా ప్రధాన పాత్ర ఉంటే తప్పకుండా ఆ పాత్రకు నా మొదటి ఎంపిక నయనతారనే అని చెప్పారు. మరి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే ఏరేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ కు కూడా పండగలాంటిందే. చూద్దాం నెల్సన్ కోరిక ఎప్పుడు తీరుతుందో.
కాాగా ప్రస్తుతం నెల్సన్ రజినీకాంత్ జైలర్ సీక్వెల్ జైలర్ 2 తో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: