వైరల్‍గా మహేష్‌ బాబు, సోదరి మంజుల ఫన్నీ వీడియో

Superstar Mahesh Babu Fun with Sister Manjula Video Goes Viral

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు వృత్తిపరంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌లో ఉంటున్నప్పటికీ కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తుంటారు. అభిమానులకు ఆయన పెద్ద స్టార్‌ హీరో అయినప్పటికీ.. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి సాధారణ వ్యక్తిలానే ఉంటుంటారు. అలాగే తన తోబుట్టువులు, బంధువులతో ప్రేమగా ఉంటారని మహేష్‌ బాబు సన్నిహితులు చెబుతుంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విషయమేంటంటే..? ఇటీవల మహేష్ బాబు ఒక ఫ్యామిలీ ఫంక్షన్‍కు హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లిలో ఆయన తన కుమార్తె సితారతో కలిసి పాల్గొని సందడి చేశారు. అయితే ఈ వేడుకకు మహేష్‌ సోదరి మంజుల కూడా వచ్చింది. ఈ సందర్భంగా తమ్ముడితో కబుర్లు చెబుతూ ఆయన పొడుగు జుత్తు పట్టుకుని సరదాగా లాగారు. దీంతో మహేష్ తన స్టయిల్‍లో స్మైల్ ఇవ్వగా.. ఇచ్చారు. ఇక మహేష్‌ ఎక్స్‌ప్రెషన్‍కి మంజుల అయితే పగలబడి నవ్వారు. అక్క, తమ్ముడు ఇద్దరూ సరదాగా కనిపించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా హల్‌చల్‌ చేస్తోంది.

ఇక ఇదిలావుంటే.. మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి దీనిని ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ అనే వర్కింగ్ టైటిల్‍తో వ్యవహరిస్తుండగా.. త్వరలోనే ఒరిజినల్ టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్స్‌ పూర్తవగా.. ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ కోసం స్పెషల్‍గా మేకోవర్ అయిన మహేష్ బాబు కొత్త లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.