కృష్ణ గారితో గడిపిన ప్రతిక్షణం నాకు చాలా అపూర్వమైనది – త్రివిక్రమ్ శ్రీనివాస్

Director Trivikram Srinivas Remembers Super Star Krishna at Guntur Kaaram Pre-Release Event

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎస్. నాగవంశీ, సంగీత దర్శకుడు థమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్న ఈ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కేరింతల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈరోజు గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా పేరు గుంటూరు కారం. రమణగాడు మీ వాడు, మనందరి వాడు. అందుకని మీ అందరి మధ్యలో ఈ ఫంక్షన్ చేయాలని అనుకున్నాం” అని తెలిపారు.

“చాలారోజుల షూటింగ్ తర్వాత విపరీతంగా అలిసిపోయి కూడా మీ అందరినీ కలవడం కోసం గుంటూరుకి వచ్చారు. రెండో కారణం.. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం. అలాంటి ఒక గొప్ప మహానటుడు, ఒక గొప్ప మనిషి. ఆయనతో నేను సినిమా చేయలేదు కానీ, ఆయన నటించిన ఒక సినిమాకి పోసాని గారి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేశాను. ఆయనతో డైరెక్ట్ గా పరిచయం కలిగినటువంటి సందర్భం అదొక్కటి మాత్రమే. ఆ తరువాత నేను అతడు, ఖలేజా సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడటం, ఆయనతో గడిపిన ప్రతిక్షణం కూడా నాకు చాలా చాలా అపూర్వమైనది, అమూల్యమైనది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “కృష్ణ గారు అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ గారు ఇంకెంత అదృష్టవంతుడు అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక్క సినిమాకి వంద శాతం పని చేయాలంటే రెండొందల శాతం పనిచేసే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు గారు. ఇది చెప్పడంలో మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా వెనక్కి తిరిగి చూడరు. నేను ‘అతడు’ సినిమాకి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో, ‘ఖలేజా’కి పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. పాతిక సంవత్సరాలైంది అంటున్నారు కానీ, నాకు మాత్రం నిన్న మొన్న పరిచయమైన హీరోలాగే కనిపిస్తున్నారు” అని అన్నారు.

అలాగే ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మహేష్ బాబు చూడటానికి ఎంత యంగ్‌గా ఉన్నారో.. మనసులోనూ అంతే యంగ్‌గా ఉన్నారు. పర్ఫామెన్స్ లో కూడా అంత నూతనంగా, అంత యవ్వనంగానే ఉన్నారు. ఆయనకు మరిన్ని వసంతాలు ఉండాలని, కృష్ణ గారి తరపున మీరందరూ ఆయన వెనక ఉండాలని, ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 12 న థియేటర్లలో కలుద్దాం. ఈ సంక్రాంతిని చాలా గొప్పగా జరుపుకుందాం. ఆనందంగా జరుపుకుందాం. రమణగాడితో కలిసి జరుపుకుందాం” అని త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ పిలుపునిచ్చారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =