అల్లరి నరేష్ నా ఫస్ట్ లవర్ – దర్శకుడు మల్లి అంకం

Allari Naresh is my First Lover, Says Director Malli Ankam

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటిస్తోంది. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. ఇక అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. మే 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరవగా.. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. ముందుగా ఈవీవీ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో అమ్మిరాజు గారి ద్వారా నరేష్ గారిని కలిశాను. ఈ సందర్భంగా అమ్మిరాజు గారికి ధన్యవాదాలు. భాను మాస్టర్ రఘు మాస్టర్ రాజు సుందరం మాస్టర్ పాటని అద్భుతంగా తీశారు. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. చాలా ప్రేమతో లిరిక్స్ రాశారు. ఆర్ట్ డైరెక్టర్, డీవోపీ సూర్య , ఎడిటర్ చోటాకే ప్రసాద్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీంకి ధన్యవాదాలు. అబ్బూరి రవి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మాటలు అద్భుతంగా రాశారు” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ థాంక్స్. ఇందులో జామి లివర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ఫరియా ఈ సినిమాకి రావడం వలన సిద్దిగా పాత్ర చాలా హైలెట్ అయ్యింది. అడివి శేష్ మా వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. నా ఫస్ట్ లవర్ నరేష్ గారు. దర్శకుడిగా అవకాశం రావడానికి చాలా స్ట్రగుల్ చేయాలి. కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంటారు. కానీ నరేష్ గారు ఇప్పటికే ముఫ్ఫై కి పైగా దర్శకులని పరిచయం చేశారు. ఆయన ఇలానే చేస్తూ మా లాంటి వారికి అండగా వుండాలి. రాజీవ్ గారు చాలా క్యాలిటీతో ఈ సినిమాని తీశారు. అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుంది” అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.