ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే 

Four films will be released this week
ఎలక్షన్ ఫీవర్ అలాగే ఐపీఎల్ వల్ల సినిమాల హడావిడి తగ్గిపోయింది.టాలీవుడ్ లోనైతే ప్రస్తుతం కేవలం  చిన్న సినిమాలే  విడుదలవుతున్నాయి.గత వారం డబ్బింగ్ సినిమా రత్నం ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా రిలీజ్ అయ్యింది.అయితే ఈవారం నాలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.అందులో అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ఒకటి. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం నరేష్ స్ట్రాంగ్ జోన్ సినిమా కావడం వీటికి తోడు  పాన్ ఇండియా  సబ్జెక్టు తో వస్తుండడం ఈసినిమాకు  అడ్వాంటేజ్ కానున్నాయి.ఇందులో ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా మల్లి అంకం డైరెక్ట్ చేశాడు.ఈ శుక్రవారం విడుదలకానుంది. 
 
ఇక అదే రోజు యంగ్ హీరో సుహాస్ నటించిన ప్రసన్నవదనం కూడా విడుదలకానుంది.వరుస హిట్ల తో ఫుల్ ఫామ్ లో వున్న సుహాస్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈసినిమాకు హైప్ వచ్చింది.అలాగే తెలంగాణ , తమిళనాడు లో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్  విడుదలచేస్తుంది.పాయల్ రాధాకృష్ణ,రాశి సింగ్ హీరోయిన్లు నటించగా అర్జున్ డైరెక్ట్ చేశాడు. 
 
ఇవి కాగా మరో రెండు సినిమాలు కూడా ఈ శుక్రవారం విడుదలకానున్నాయి. అందులో రాకేష్ వర్రే  హీరోగా నటించిన జితేందర్ రెడ్డి ఒకటైతే మరొకటి ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటించిన శబరి. ఇందులో శబరి పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.