సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎస్ఎస్ఎమ్బి 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి,మహేష్ కలిసి సినిమా చేస్తున్నామని చెప్పారు కానీ ఇంతవరకు అఫీషియల్ గా ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు అయితే ఈసినిమా నిర్మాత కేఎల్ నారాయణ మాత్రం తాజాగా షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు.
అదేంటంటే రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడని మహేష్ కొన్ని సీక్వెన్స్ కోసం వర్క్ షాప్ లో పాల్గొంటున్నాడని నారాయణ అన్నారు.అంతేకాదు అన్ని కుదిరితే సెప్టెంబర్ నుండి షూటింగ్ కూడా మొదలుపెడుతామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.సో సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ వున్నట్లే. అయితే మాములుగానే రాజామౌళి సినిమాలు చాలా స్లోగా స్టార్ట్ అవుతాయి.
అందులో ఇది గ్లోబ్ ట్రోటింగ్ మూవీ గా వస్తుంది మరి దీనికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనసరవం లేదు.మరి షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలుపెడితే మహేష్ ఫ్యాన్స్ లక్కీనే.ఇక ఈసినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి. ఈసినిమాతో మహేష్ పాన్ ఇండియా లీగ్ లో అడుగుపెట్టనున్నాడు.ఇప్పటివరకు రీజినల్ మూవీస్ తోనే మహేష్ రికార్డులు క్రియేట్ చేశాడు.ఈ 29వ సినిమా,బాహుబలి రికార్డులు బ్రేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.వచ్చే ఏడాది చివర్లో కానీ లేదంటే 2026లో ఎస్ఎస్ఎమ్బి 29 ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: