జపాన్ లో రిలీజ్ కానున్న సలార్ 

Salaar Cease Fire Releasing in Japan on July 5th
గత ఏడాది చివర్లో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ పార్ట్ 1 కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.అంతేకాదు వరస ప్లాప్ లో వున్న ప్రభాస్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.ఇక ఈసినిమా ఇప్పుడు జపాన్ లో కూడా విడుదలకానుంది.ఇప్పటికే ఓటిటిలో ఇంగ్లీష్ లో కూడా అందుబాటులోకి వచ్చిన ఈసినిమా ఇప్పుడు జపనీస్ లోకి వెళ్తుంది.బాహుబలి సిరీస్ తో ప్రభాస్,జపాన్ లో కూడా ఫ్యాన్స్ బేస్ క్రియేట్ అయ్యింది.దాంతో సలార్ ను అక్కడ విడుదల చేస్తున్నారు. 
 
జూలై 5న ఈసినిమా జపాన్ లో విడుదలకానుంది.మరి అక్కడ ఎలాంటి రెస్సాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.ఇక సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.సెకండ్ పార్ట్ లో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్దశత్రువులుగా మారిన తరువాత కాన్సార్ కథ ఏమైందో చూపెట్టనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 
 
మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం కల్కి2898 AD సినిమా పూర్తి చేసే పనిలో వున్నాడు.నిజానికి ఈనెల 9న ఈసినిమా విడుదలకావాల్సి ఉండగా వాయిదా వేశారు.రీసెంట్ గా న్యూ రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు.జూన్ 27న ఈసినిమా థియేటర్లోకి రానుంది.నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తుంది.అమితాబ్ ,కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈసినిమా విడుదల తరువాతే ప్రభాస్,సలార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. 
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 13 =