నందమూరి బాలకృష్ణతో అలాంటి సినిమా చేస్తాను – ప్రశాంత్ వర్మ

Hanuman Director Prashanth Varma Responds Over Movie with Nandamuri Balakrishna

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హను-మాన్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ దీనిని సోషియో ఫాంటసీగా రూపొందిస్తున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేష‌న్‌లో వచ్చిన ‘జాంబీరెడ్డి’ సినిమా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ‘హను-మాన్’ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో విడుదల కానుండటం విశేషం. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఒరిజిన‌ల్ సూప‌ర్ హీరో కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి కానుకగా వచ్చేనెల జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక గత కొన్నిరోజుల క్రితం విడుదలైన ఈ చిత్రం టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ అన్నీ మంచి స్పందన రాబట్టుకున్నాయి. ఇక ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజెన్లు ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ‘హనుమాన్’ సినిమా ట్రైల‌ర్ నేడు (డిసెంబర్ 19, 2023) విడుద‌లైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే విషయమై స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ గారితో సినిమా చేయాలని తనకూ ఉందని, తప్పకుండా చేస్తానని అన్నారు. కాగా ఇప్పటికే బాలకృష్ణకు ఒక కథ వినిపించానని, అది ఆయనకు కూడా బాగా నచ్చిందని తెలిపారు. అయితే అంతకంటే ముందు ఒక సినిమా చేయాలని భావించానని, ఇప్పుడు ఈ హనుమాన్ చిత్రాన్ని బాలకృష్ణకు చూపించి, ఆయనకు నచ్చితే తమ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తానని వెల్లడించారు. ఇక బాలకృష్ణతో తాను తీయబోయే సినిమా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నానని, అందుకే ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ తరహా చిత్రాన్ని తీస్తానని తెలిపారు.

అలాగే గతంలో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హీరో తరహా క్యారక్టర్ చేశారని, ఆ సినిమా ఇన్స్పిరేషన్ మీ సినిమాపై ఉందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రశాంత్ వర్మ ఇలా బదులిచ్చారు. ఆ విషయాన్ని గురించి ఇప్పుడేమి వ్యాఖ్యానించమని, అయితే దీనికి సంబంధించి మా సినిమాలో ఒక ట్రిబ్యూట్ లాగా ఉంటుందని, మూవీ చూశాక మీకు కూడా అది నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హనుమాన్ చిత్రం అన్ని వయస్సుల వారిని అలరిస్తుందని, ఇది మన నేటివిటీకి తగిన కథ అయినప్పటికీ.. అన్ని ప్రాంతాలవారికి కనెక్ట్ అవుతుందని డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 5 =