సలార్, గుంటూరు కారం సినిమాలపై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hanuman Director Prashanth Varma Interesting Comments on Salaar and Guntur Kaaram Movies

‘జాంబీరెడ్డి’ సినిమా త‌ర్వాత తేజ స‌జ్జా, ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ ‘హను-మాన్’. ఇక ‘హను-మాన్’ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో విడుదల కానుండటం విశేషం. ఫ‌స్ట్ ఇండియ‌న్ ఒరిజిన‌ల్ సూప‌ర్ హీరో సినిమాగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 12న పాన్ వరల్డ్‌ స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదలవగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో సినిమాపై మంచి హైప్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషియో ఫాంటసీగా రూపొందిన ‘హను-మాన్’ సినిమా ట్రైల‌ర్ ఈరోజు (డిసెంబర్ 19, 2023) విడుద‌లైంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ సలార్, గుంటూరు కారం సినిమాలపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘హను-మాన్’ సినిమాను తేజ సజ్జా వంటి చిన్న హీరోతో తీశారెందుకు? ప్రభాస్ వంటి స్టార్ హీరోతో చేయాల్సిన సబ్జెక్ట్ కదా అని అడిగిన ప్రశ్నకు.. ప్రభాస్ కి ప్రత్యేకించి హనుమాన్ పవర్ తో పనేముంది? ఆయన విలన్లకు ఒక్క పంచ్ ఇస్తే చాలు కదా అని అన్నారు. తాజాగా రిలీజైన ‘సలార్’ ట్రైలర్ చూశానని, అందులో ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పారు.

ఇక మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమాకు పోటీగా మీ ‘హను-మాన్’ చిత్రాన్ని అదేరోజు రిలీజ్ చేస్తున్నారెందుకు? అని అడిగిన ప్రశ్నకు ప్ర‌శాంత్ వ‌ర్మ ఇలా సమాధానమిచ్చారు. తాము కావాలని ఇలా చేయడంలేదని, ఈ సినిమాను ఆరోజున రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించామని, ఇందుకు సంబంధించి ఇతర భాషలలో కూడా కమిట్ మెంట్ అయిందని తెలిపారు. అయితే మహేష్ బాబు సినిమా విడుదల తేదీ మారిందని గుర్తు చేసిన ఆయన.. ఇదే విషయమై ఆ చిత్ర నిర్మాతలతో కూడా చర్చించామని, తమ మధ్య ఎలాంటి క్లాష్ లేదని స్పష్టం చేశారు. ఇంకా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. తాను కూడా మహేష్ అభిమానినేనని, అనుకోకుండా ఇలా తమ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =