సపోర్టింగ్ రోల్స్ నుండి ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ప్రియదర్శి. బలగంతో పెద్ద విజయాన్ని అందుకున్న ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నాడు. సేవ్ ది టైగర్స్ ఫ్రాంచైజీ తెలుగు ఒరిజినల్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అయితే పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లు ప్రియదర్శి లైన్ లో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. ప్రియదర్శి హీరోగా ఒక కొత్త సినిమా రాబోతుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో ప్రియదర్శి డిఫరెంట్ హిలేరియస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
Kaavaalsina vaallaki kaavaalsinantha – Romance, Entertainment and a whole lot of THRILLS Guaranteed amma 😎
SVACLLP & RANA DAGGUBATI proudly present @PriyadarshiPN in Production no.9 💥
Mee andariki seegrameva THRILLU-Praptirasthu ⏳@Navaneethfilm @narang_jhanvi9 pic.twitter.com/06AAxTZQyg
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) April 28, 2024
కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి, 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది. తారాగణం, టెక్నికల్ టీం వివరాలతో పాటు చిత్రం టైటిల్ త్వరలో రివిల్ చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని SVACLLP & రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సగర్వంగా ప్రెజెంట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డును అందుకున్న జాన్వీ నారంగ్‌నిర్మాతగా మేడిన్ ప్రొడక్షన్ గా ఈసినిమా నిర్మితమవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: