గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సీక్వెల్ కూడా 

Gangs Of Godavari Sequel Confirmed
యంగ్ హీరో విశ్వక్ సేన్ మొదటి సారి ఊర మాస్ రోల్ లో నటిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు.టీజర్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు విశ్వక్.రూరల్ బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది.దసరా టైప్ లో ఫుల్ యాక్షన్ సబ్జెక్ట్ ఇది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వుండనుందట.సీక్వెల్ కు సరిపడా కంటెంట్ తో వస్తుందట గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాంతో సీక్వెల్ కంఫర్మ్ గా ఉంటుందని న్యూస్.అయితే ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ను బట్టే  సీక్వెల్ తీయడం ఆధారపడి ఉంటుంది.
 
ఇక విశ్వక్ అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఈసినిమాకు ముందు తరువాత అనేలా తన కేరీర్ వుంటుందని  విశ్వక్ బలంగా నమ్ముతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలు చార్ట్ బాస్టర్ లు కావడం టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు హైప్ అయితే వుంది.మరి ఈసినిమాతో విశ్వక్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. 
 
కృష్ణ చైతన్య ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా నేహా శెట్టి హీరోయిన్ గా అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈసినిమా మే 17న విడుదలకానుంది.  
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.