శ్రీరామ్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ నుండి వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైప ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆకట్టుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇక నా మాటే అనే జోష్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈపాట మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. దీనిలో భాగంగానే తాజాగా ఈపాట రిలీజ్ డేట్ అండ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఓహ్ మనమే అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 30, 2024 న సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపారు.
Ready to regin the hearts of the audience with 2nd single from the world of #Manamey ❤🔥#OhManamey ~ Bringing you all a BREEZY melody that’s gonna FREEZE you all this SUMMER! 🤩❤
Releasing on 30th Apr, 5:04PM 📢
A @HeshamAWMusic Musical 🎹@ImSharwanand @IamKrithiShetty… pic.twitter.com/bjRF66mglX
— People Media Factory (@peoplemediafcy) April 28, 2024
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: