తండేల్- భారీ ధరకు డిజిటల్ రైట్స్

naga chaitanya thandel movie digital rights sold for huge price

నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈసినిమా డిజిటల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం.. తండేలా స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ.40 కోట్లకు సొంతం చేసుకున్నారట. అయితే ఇది చైతూ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం.

కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.