చెన్నైలో వరదలు.. అమీర్ ఖాన్, విష్ణు విశాల్‌కు అజిత్ సాయం

Ajith Meets Aamir Khan and Vishnu Vishal After they were Rescued From Chennai Floods

కాగా బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేసింది. తుఫాన్ ప్రభావంతో రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షపాతం కారణంగా చెన్నైలో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్ల పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు, అనేక ప్రైవేట్ కార్యాలయాలు మూసివేశారు. ఈదురు గాలులతో నగరమంతటా చెట్లు, గోడలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్‌ వరద ముంపులో చిక్కుకున్నారు. తాము నివసిస్తున్న కరపాక్కమ్‌ లోని పరిస్థితిని తెలియజేస్తూ ట్విట్టర్‌లో ఫొటోలను షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ ఖాన్‌ కూడా ఈ వరదల్లో చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణా బృందం కరపాక్కమ్‌కు చేరుకొని విష్ణు విశాల్‌, గుత్తా జ్వాల దంపతులతోపాటు అమీర్‌ ఖాన్‌ను సంప్రదించి సురక్షిత ప్రదేశానికి తరలించింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. వారిని కలుసుకున్నారు. అక్కడినుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆయన స్వయంగా దగ్గరుండి ప్రయాణ ఏర్పాట్లను ఏర్పాటు చేశారు.

అనంతరం విష్ణు విశాల్‌ ట్విట్టర్‌లో అజిత్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు అందులో.. “ఒక సాధారణ స్నేహితుడి ద్వారా మా పరిస్థితిని తెలుసుకున్న తర్వాత, ఎల్లప్పుడూ సహాయాన్ని అందించడానికి ముందుండే అజిత్ సర్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. మా విల్లా కమ్యూనిటీ సభ్యులకు ప్రయాణ ఏర్పాట్లలో సహాయం చేసారు.. లవ్ యూ అజిత్ సర్!” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్.. అమీర్ ఖాన్, అజిత్ కుమార్‌లతో దిగిన ఫోటోను పంచుకున్నారు. ఇక మరోవైపు ప్రముఖ తమిళ నటులు, సోదరులు సూర్య మరియు కార్తీ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని ప్రాంతాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు మరియు తిరువళ్లూరు జిల్లాల వరదలతో అతలాకుతలమైన జిల్లాలకు రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు.

ఇక మిచౌంగ్ తుఫాన్ కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడిది. రైల్వే స్టేషన్లలోకి వరద నీరు రావడంతో అనేక రైళ్లను రద్దు చేశారు. అలాగే చైన్నై విమానాశ్రయం రన్‌వే జలమయం కావడంతో విమాన సేవలను నిలిపివేశారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో తుఫాన్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సోమవారం, మంగళవారం సెలవులు ప్రకటించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, రెస్క్యూ సహా వివిధ శాఖల సిబ్బందిని పెద్దఎత్తున మోహరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + two =