విభీషణుడి పాత్ర చేయాలంటే.. శ్రీరాముని అనుగ్రహం వుండాలి

Actor Samuthirakani Thanks To Audience as HanuMan Completes 100 Days

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. ఈ వేడుకని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా వుంది. ఏదైనా మంచి పని చేయాలంటే దేవుని బ్లెస్సింగ్స్ వుండాలి. ఆ దీవెనలే మా అందరినీ ఒక్క చోటికి చేర్చింది” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “విభీషణుడి పాత్ర చేయాలంటే మామూలు విషయం కాదు. శ్రీరాముని అనుగ్రహం వుండాలి. నాలో ఆ పాత్రని చూశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇంతనమ్మకం పెట్టుకున్న ప్రశాంత్ కి ధన్యవాదాలు. తమ్ముడు తేజా సజ్జా చాలా కష్టపడ్డాడు. అందరం ఇష్టపడి కష్టపడ్డాం. మా నిర్మాతలకు ధన్యవాదలు. టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు లేకపోతే ఈ విజయం లేదు” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 14 =