హాయ్ నాన్న లో చూడాలనుకునే ఆసక్తికర అంశాలు

hi nanna movie interesting elements

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లతో ఈసినిమాకు మంచి హైప్ ను తెచ్చిపెట్టాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో థియేటర్లలోకి రానుంది. మరి ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ అంశాలు ఏం ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాని
ఈసినిమాకు ప్రధాన బలం హీరోగా చేసిన నాని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా. దసరా లో ఫుల్ మాస్ రోల్ లో కనిపించి తనలో మరో యాంగిల్ చూపించిన నాని.. ఈసినిమాకు మేకోవర్ ఛేంజ్ చేసేసి క్లాస్ లుక్ లో కనిపించనున్నాడు. నాని లాంటి న్యాచురల్ స్టార్ కు ఏ రోల్ అయినా చాలా ఈజీ కాబట్టి.. అందులోనూ ఎమోషనల్ కంటెంట్ ను పండించడంలో నాని ఎక్పర్ట్ కాబట్టి ఈసినిమాలో కూడా నాని బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తాడని చెప్పొచ్చు.

మృణాల్
నాని తరువాత ఈసినిమాలో ఉన్న మరో హైలెట్ మృణాల్ ఠాకూర్. నిజానికి ఈసినిమానే మృణాల్ కు మొదటి సినిమా అయితే ఎలా ఉండేదో తెలియదు కానీ.. తెలుగులో ఇప్పటికే సీతారామం సినిమాతో ఎంట్రీ ఇవ్వడం.. ఆ సినిమాలో సీత రోల్ లో తన మెస్మరైజింగ్ నటనతో అలరించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడంతో ఈసినిమాలో మృణాల్ ను చూసేందుకు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్ లను చూస్తుంటే మరోసారి మృణాల్ మంచి మార్కులే కొట్టేసేలా కనిపిస్తుంది.

నాని-మృణాల్-ఖైరా కాంబినేషన్
ఈసినిమాకు వీరి కాంబినేషన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఎమోషనల్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానున్న నేపథ్యంలో నాని-మృణాల్ మధ్య లవ్ సీన్స్ అలానే వారి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు నాని, బేబి ఖైరా మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, వారి బాండింగ్ ఈసినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా అవ్వనుంది. ముగ్గురి కాంబినేషనే ఈసినిమా కు కలిసొచ్చే ప్రధాన అంశం.

కథ
శౌర్యువ్ దర్శకత్వంలో లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. రెండు యాంగిల్స్ ను ఒకే సినిమాలో ఒకే కథగా రాసుకోవడం.. దాన్ని అంతే ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేయడం ఈసినిమాకు కలిసొచ్చే అంశం. ఒకపక్క కూతురితో ఎమోషనల్ కంటెంట్ ను అలానే మృణాల్ తో లవ్ స్టోరీని పార్లర్ గా చూపించనున్నాడు శౌర్యువ్.

సంగీతం
సినిమాకు మంచి బజ్ రావడంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. హేషమ్ అబ్దుల్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తను ఇప్పటికే ఖుషి సినిమాతో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. ఇక ఈసినిమాకు కూడా తను అందించిన మ్యూజిక్ ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సమయమా లాంటి మెలొడీ సాంగ్, గాజు బొమ్మ లాంటి ఎమోషనల్ సాంగ్, అమ్మాడి లాంటి సోల్ ఫుల్ సాంగ్, ఓడియమ్మ లాంటి పార్టీ సాంగ్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడాా ఆకట్టుకుంటుంది.

మరి మంచి పాజిటివ్ బజ్ కు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే మరో రోజు ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seventeen =