గ్రాండ్‌గా ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త చిత్రం

Sundeep Kishan's New Film SK30 Launched Grandly Today

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేశారు. కాగా ఇది సందీప్ కిషన్‌కు ల్యాండ్‌మార్క్ (30వ) చిత్రం కావడం విశేషం. వర్కింగ్ టైటిల్ #SK30గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ‘ధమాకా’ ఫేమ్ త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మంగళవారం #SK30 గ్రాండ్‌గా ప్రారంభించబడింది. ముహూర్తం వేడుకకు విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్‌బోర్డ్‌ను వినిపించారు. నిర్మాత అనిల్ సుంకర తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండనుంది. విలక్షణ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్ రైటర్‌గా ఈ SK30కి పని చేస్తున్నారు. ఈ కొత్త చిత్రం త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. అలాగే యంగ్ మరియు టాలెంటెడ్ టెక్నీషియన్స్ వివిధ క్రాఫ్ట్‌లను చూసుకుంటున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. కాగా ఇప్పటికే ‘సామజవరగమన’ మరియు ‘ఊరు పేరు భైరవకోన’ వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.