ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మళ్లీ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి మరొక పాటను రిలీజ్ చేశారు. కనులెందుకో కలిసేనులే కలలా ఇలా అంటూ వచ్చే ఈ మెలోడి సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు చిత్రబృందం. పాట అయితే ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Kanulenduko from the movie Haromhara is out now! 🎬🎶 Dive into its soulful melodies and let it sweep you away. Don’t miss out, go listen to it now! 🎧 #HaromHara #Kanulenduko
▶️ https://t.co/GTUbFMaRRW@chaitanmusic
@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @SSCoffl… pic.twitter.com/Tksn7gmgX8— Sudheer Babu (@isudheerbabu) April 24, 2024
కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: